Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌
హెరాయిన్‌ విషయంలో రాజకీయ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఈ విషయంలో అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పు దోవ పట్టించొద్దని ఆయన కోరారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హెరాయిన్‌ విషయంలో ఏపీ పాత్ర ఉందని దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. వాస్తవాలను పదే పదే వక్రీకరిస్తూ ప్రకటనలు చేయడం సమంజసం కాదని సూచించారు. విజయవాడను ట్రాన్స్‌ఫోర్ట్‌ అడ్రస్‌గా మాత్రమే వాడుకున్నారని గుర్తుచేశారు.చెన్నై కేంద్రంగానే మొత్తం లావాదేవీలు జరిగినట్లు చెప్పారు. హెరాయిన్‌ విషయంలో రాజకీయ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇటువంటి ఆరోపణలతో ప్రజల్లో అనేక అపోహలు కలగడమే కాకుండా వారు అభద్రతా భావానికి లోనయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు రాష్ట్రంలో చోటు లేదని తేల్చిచెప్పారు.హెరాయిన్‌ కేసులో దర్యాప్తు బృందాలకు తాము పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img