అసెంబ్లీ చరిత్రలో నేడు చీకటి రోజని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని చంద్రబాబు ఖండించారు. రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై దాడి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. సీఎం జగన్ ప్రోద్బలంతోనే ఎమ్మెల్యే స్వామిపై దాడి చేశారన్నారు. నేటి ఘటనతో జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడన్నారు. చట్టసభలకు మచ్చ తెచ్చిన సీఎంగా జగన్ నిలిచిపోతారన్నారు. ఇది శాసనసభ కాదుౌ కౌరవ సభ అంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కారణంగా జగన్ కు పిచ్చెక్కుతుందని చురకలు అంటించారు చంద్రబాబు. ఏపీ చరిత్రలోనే ఇది ఒక చీకటి రోజు అంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.