Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

ఆగస్ట్‌ 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

మంత్రి సురేష్‌
కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఆగస్టు ఆగస్ట్‌ 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. ఉపాధ్యాయులకు ఆగస్ట్‌ 16 లోపు 100 శాతం వ్యాక్సిన్‌ వేస్తామని తెలిపారు. రెండో విడత విద్యాకానుక అన్ని పాఠశాలల్లో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నాడు-నేడులో భాగంగా జరుగుతున్న పనులు 98 శాతం పూర్తయ్యాయని, ఆగస్ట్‌ 16న నాడు-నేడు ఫేజ్‌-2తో.. స్కూళ్ల రూపురేఖలు మార్చేలా కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు.అమ్మ ఒడి, వసతి దీవెన వద్దనుకుంటున్నవారికి.. వచ్చే ఏడాది నుంచి ల్యాప్‌టాప్‌లు ఇవ్వనున్నట్లు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img