Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

ఆదిరెడ్డి అప్పారావు, వాసుల‌కు బెయిల్ మంజూరు

జగజ్జనని చిట్ ఫండ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు,. ఆయన తనయుడు వాసులకు ఏపీ హైకోర్టు బుధవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. జగజ్జనని చిట్ ఫండ్ కేసులో వీరిద్దరిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జగజ్జనని చిట్ ఫండ్ కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు వాసులను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కొడుకు వాసులు బెయిల్ కోసం ఈ నెల 3వ తేదీన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్నది. ఇవాళ ఏపీ హైకోర్టు తీర్పును వెల్లడించింది. చిట్ ఫండ్ చట్టం ఈ కేసుకు వర్తించదని అప్పారావు తరపు న్యాయవాదులు వాదించారు. డిపాజిట్ దారుల పిర్యాదు లేకుండానే కేసు నమోదు చేశారని వారు గుర్తు చేశారు అయితే ఈ వాదనను సీఐడీ తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత అప్పారావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img