ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. వైఎస్సార్ జిల్లాలో జగన్ తన మూడురోజుల పర్యటన పూర్తిచేసుకొని పులివెందుల నుంచి తిరుగు ప్రయాణమైన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి వీడియో ఇది. ముఖ్యమంత్రికి అర్జీ ఇవ్వడానికి రాగా దాన్ని ఎంపీ అవినాష్ రెడ్డికి అందజేయమని జగన్ సూచించారు. అర్జీదారు మాత్రం జగన్ కు ఇవ్వడానికే ప్రయత్నించారు. అప్పుడు జగన్ ఎంపీని చూపిస్తూ ఆయనెవరో కాదు.. నా తమ్ముడయ్యా స్వామి అంటూ వీడియోలో జగన్ మాట్లాడారు. పులివెందుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులతో కొవిడ్ కు సంబంధించి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడైనా అనుమానమొస్తే వెంటనే కొవిడ్ పరీక్షలు చేపట్టాలని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వాస్పత్రులను సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించారు. కొవిడ్ పరీక్షలు, మందుల సరఫరా, చికిత్స, నివారణ లాంటి పనులన్నీ విలేజ్ క్లినిక్స్ ద్వారా జరగాలని, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. విలేజ్ క్లినిక్స్ పీహెచ్ సీల పర్యవేక్షణలో పనిచేసేలా చూడాలన్నారు. జనవరి 26వ తేదీనాటికి క్లినిక్స్ అన్నీ పూర్తికావాలని ఆదేశించారు. మంగళవారం ఢల్లీి వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్ రాత్రికి అక్కడే బస చేసి బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవనున్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడిరచాయి. ఈనెల 5వ తేదీన జీ20 సదస్సుల సన్నాహక సమావేశానికి సీఎం ఢల్లీి వెళ్లినప్పుడే ప్రధానమంత్రిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. ఇప్పుడు ఇవ్వడంతో ప్రధానమంత్రిని కలిసి ఏ విషయాలపై చర్చించనున్నారు? ఏయే అంశాలు ప్రస్తావనకు రానున్నాయనేదాన్ని అధికారికంగా వెల్లడిరచలేదు.