Friday, February 3, 2023
Friday, February 3, 2023

ఆరునూరైనా చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారు

: అచ్చెన్నాయుడు

ఆరునూరైనా టీడీపీ అధినేత చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఒక్క అవకాశం ఇచ్చి… దరిద్రాన్ని నెత్తిన తెచ్చుకున్నామని.. వ్యవస్థలు నాశనం అయిపోయాయని అన్నారు. వైసీపీ హయాంలో విద్యుత్‌ రంగం చిన్నాభిన్నం అయిందన్నారు. సమర్ధుడైన నాయకుడు వస్తే గానీ రాష్ట్రంలో పరిస్థితి చక్కబడదని అన్నారు. టీడీపీ హయాంలో విద్యుత్‌ రంగాన్ని సంస్కరించామని.. నాణ్యమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేశామన్నారు.రాయలసీమ థర్మల్‌ ప్లాంట్‌ మూసివేసే మూర్ఖుడు జగన్‌ అని..ఈ ప్లాంట్‌ మూత పడకుండా టిడిపి కృషి చేసిందని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో ప్రజలకు 24 గంటలు, రైతులకు 7 గంటలు విద్యుత్‌ అందించామని తెలిపారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు హయాంలో ఎంతో మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరణ చేశామన్నారు.పాదయాత్రలో ఇచ్చిన హామీల నమ్మి అధికారం ఇచ్చారని ఆయన అన్నారు. కార్మిక సంక్షేమం జరగాలంటే మళ్లీ టీడీపీ రావాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img