Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మరో విశిష్ట పురస్కారం.. ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

టాలీవుడ్‌ ప్రముఖ నటులు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లతో కలిసి దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. విదేశాల్లో సైతం ఈ సినిమా రికార్డులు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఆస్కార్‌ రేసులో ఉన్న ఈ సినిమాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డు లభించింది.
కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్‌ హాల్‌ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో బుధవారం రాజమౌళి, ఎన్టీఆర్‌, కీరవాణి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ‘నాటు నాటు’ పాటకు పురస్కారం ప్రకటించిన వెంటనే వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అందరూ చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img