Monday, February 6, 2023
Monday, February 6, 2023

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాషోకు అంతరాయం..థియేటర్‌ అద్దాలు ధ్వంసం చేసిన ఫ్యాన్స్‌

విజయవాడ నగరంలోని అన్నపూర్ణ థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షోకు అంతరాయం కలిగింది. షో ప్రారంభమైన గంటలో స్క్రీన్‌ నిలిచిపోవడంతో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో అక్కడి వస్తు సామాగ్రిని ధ్వంసం చేశారు. థియేటర్‌లోని ఫర్నీచర్‌తో పాటు అద్దాలను పగలగొట్టారు. థియేటర్‌ మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అద్దాలు ధ్వంస చేసే సమయంలో పలువురు అభిమానులకు గాయాలయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img