Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

ఆర్టీసీ బస్సులో గొడుగు వేసుకున్న ప్రయాణికులు.. ఫోటో వైరల్‌, జనసేన సెటైర్లు

ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు గొడుగు వేసుకుని కూర్చన్న ఫోటో ఒకటి వైరల్‌ అవుతోంది. బస్సులో ప్రయాణికులు గొడుగులు వేసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. అవును ఈ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విశాఖపట్నం నుంచి సాలూరు వెళ్తున్న ఆర్టీసీ అల్ట్రా డీలక్స్‌ బస్సులో పరిస్థితి ఇది అంటూ విమర్శలు వస్తున్నాయి. ఆదివారం రాత్రి జోరుగా వర్షం కురవటంతో బస్సు టాప్‌ నుంచి నీళ్లు వచ్చాయని.. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ప్రయాణికులు గొడుగులతో వచ్చారన్నారు.. బస్సులో కూడా వాటిని వేసుకోవాల్సి రావడంపై అసహనం వ్యక్తం చేశారని ఫోటోను ప్రచారం చేస్తున్నారు. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ ఈ ఫోటోను ట్వీట్‌ చేశారు. జగన్‌ సర్కార్‌ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ‘ఆకాశానికి చిల్లు.. ఆర్టీసీ బస్సుకూ చిల్లు.. ఈ పాలనలో.. సగటు బతుకుకూ చిల్లే!’అంటూ సెటైర్లు పేల్చారు. అంతేకాదు టీడీపీ నేతలు కూడా ఈ ఫోటోను ట్వీట్‌ చేశారు. ఇదీ ఆర్టీసీ బస్సుల పరిస్థితి అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఈ ఫోటోపై ఆర్టీసీ, ప్రభుత్వ అధికారులు స్పందించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img