Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

ఆ వీడియో ఫేక్‌ అని ఎలా తేల్చారో చెప్పాలి: నారా లోకేశ్‌

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చెందినదిగా వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినల్‌ కాదంటూ అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప చేసిన ప్రకటనపై టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్‌ స్పందించారు. జిల్లా ఎస్పీ ఫకీరప్ప మీడియా సమావేశం ముగిసిన మరుక్షణమే మంగళగిరిలో మీడియా ముందుకు వచ్చిన లోకేశ్‌ పలు అంశాలపై ఎస్పీకి ప్రశ్నలు సంధించారు. ఎంపీ మాధవ్‌కు చెందినదిగా భావిస్తున్న ఆ వీడియో ఫేక్‌ అని ఎలా తేల్చారో ఎస్పీ ఫకీరప్ప చెప్పాలని నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోకు సంబంధించి ఒరిజినల్‌ వీడియో అంటూ ఒకటి ఉందని ఎస్పీ భావిస్తున్నారా? అని కూడా లోకేశ్‌ ప్రశ్నించారు. అయినా ఆ వీడియో ఒరిజినల్‌ కాదంటూ ఏ ఫోరెన్సిక్‌ నివేదిక చెప్పిందో ఎస్పీ బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img