Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022

ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు జగన్‌ రెడ్డిగారూ? : నారా లోకేశ్‌

ఓటు వేయని వారిపై వేటు వేయడం వైసీపీ నయా ఫ్యాక్షన్‌ డెమోక్రసీ అని టీడీపీ నేత నారా లోకేశ్‌ ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ అభ్యర్థుల ఏకగ్రీవానికి ఒప్పుకోకపోతే వైసీపీ దాడులు, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులు, కిడ్నాప్‌లు, హత్యలు చేయడం వంటివాటిని స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చూశామని చెప్పారు. టీడీపీ అభ్యర్థికి ఓటేసి తన ఓటమికి కారణమయ్యాడనే కక్షతో వారి ఇంటిని వైసీపీ నేత పోలయ్య కబ్జా చేశాడని మండిపడ్డారు.అధికారం అండతో పోలయ్య ఇంటిని ఆక్రమించడంతో ఆ కుటుంబం రోడ్డున పడిరదని అన్నారు. ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు జగన్‌ రెడ్డిగారూ? అని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడక ముందే కబ్జాలు, అరాచకాలు మానండని ట్వీట్టర్‌లో సూచించారు. దీంతోపాటు ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని షేర్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img