మూడు రాజధానుల నిర్ణయాన్ని కేబినెట్ ఉపసంహరించుకోవడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్పందించారు. ఇంటర్వెల్ మాత్రమే అయ్యిందని, సినిమా ఇంకా పూర్తికాలేదని అన్నారు. శుభం కార్డుకు మరింత సమయం ఉందని చెప్పారు. తిరుపతిలోని రాయలచెరువు వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామన్నారు. ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని అన్నారు. బిల్లుల ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదని అన్నారు. రాజధాని రైతులు, టీడీపీ వేరు కాదు. రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రను టీడీపీనే చేయిస్తోందని అన్నారు.