Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

ఇది ఎంప్లాయ్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ : సజ్జల

ఉద్యోగుల భద్రతలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండడుగుల ముందే ఉంటారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం తాడేపల్లిలో సీఎంఓ అధికారులతో ఉద్యోగ సంఘాల నాయకులు చర్చలు జరిపారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..ఉద్యోగులకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు.రెండేళ్లుగా కోవిడ్‌ వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారిందని, దీంతో కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని, పీఆర్సీ వంటి సమస్యలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఏ ఉద్యోగుల సంఘాలు వచ్చినా, ఉద్యోగులు వచ్చినా మేము స్పందిస్తాం. ఇది ఎంప్లాయ్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img