Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

ఇది ముమ్మాటికీ క్రిమినల్‌ చర్యే : నాదెండ్ల మనోహర్‌

పన్నుల పేరిట డబ్బు కోసం జగన్‌ ప్రభుత్వం జనాన్ని పీడిస్తోందని జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ పరిధిలో పన్నుల కోసం వెళ్లిన అధికారులు.. ఇంట్లో మహిళలు ఉండగానే ఆ ఇంటికి తాళం వేసిన ఘటన పై నాదెండ్ల మనోహర్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.ఖజానాను నింపుకోవడానికి పన్నుల పేరిట ప్రజలను పీడిరచడంతో పాటుగా వేధిస్తున్నారని జగన్‌ ప్రభుత్వంపై నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఓటీఎస్‌ పేరుతో ప్రజల ముక్కుపిండి మరీ వందల కోట్ల మేర నిధులను లాగేశారని ఆయన ఆరోపించారు. పన్నుల కోసం ప్రజల ఇళ్లకు వెళుతున్న అధికారులు.. అక్కడ పన్నుల వసూళ్ల పేరిట సాగిస్తున్న అరాచకాలను నాదెండ్ల ఈ సందర్భంగా ప్రస్తావించారు.తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ పరిధిలో పన్నుల కోసం వెళ్లిన అధికారులు.. ఇంట్లో మహిళలు ఉండగానే ఆ ఇంటికి తాళం వేశారని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య అక్రమ గృహ నిర్బంధం కిందకే వస్తుందన్న ఆయన.. ఇది ముమ్మాటికీ క్రిమినల్‌ చర్యేనని ఆయన పేర్కొన్నారు. అధికారులు సాగిస్తున్న ఈ తరహా దుశ్చర్యలను ప్రజలు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ తరహా చర్యలను తమ పార్టీ ఖండిస్తోందని నాదెండ్ల తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img