Friday, March 24, 2023
Friday, March 24, 2023

ఇప్పటంలో ప్రారంభమైన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ

నేటితో జనసేన పార్టీ 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ ఏట అడుగుడుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని ఇప్పటం గ్రామం వద్ద జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాటు చేశారు. మద్యాహ్నం నుంచి రాత్రి 7.30 గంటల వరకు సభను నిర్వహిస్తారు. ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు హాజరయ్యారు. సభకు భారీ ఎత్తున జనసైనికులు, పవన్‌ అభిమానులు తరలివచ్చారు. కాగా సభావేదికకు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య పేరిట నామకరణం చేశారు. ప్రస్తుతం సభలో జనసేన పార్టీ నేతలు ప్రసంగిస్తున్నారు. ఇటీవల కాలంలో జరిగిన పలు పరిణామాలపై తన సమాధానం ఈ సభ ద్వారా తెలియజేస్తానని పవన్‌ పేర్కొనడం తెలిసిందే.దీంతో పవన్‌ ప్రసంగం కోసం జనసైనికులు, అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img