Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

ఇప్పుడు ఎంపీపై చర్యలు తీసుకుంటారో లేదో చూద్దాం: బుద్ధా వెంకన్న

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో కాల్‌ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్సీ, పార్టీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న స్పందించారు. పార్టీ పేరును ఎంపీ గోరంట్ల మాధవ్‌ సార్థకం చేస్తున్నాడని సెటైర్‌ వేశారు. పార్టీలో గోరంట్ల మాధవ్‌ మరో ట్రెండ్‌ సెట్టర్‌ అని అన్నారు. వైసీపీ ఆశీస్సులతో ఇప్పటివరకు అవంతి అరగంట సరసం, అంబటి గంట విరహం ఆడియోలు బయటికొచ్చినా వారిపై జగన్‌ ఏ చర్యలు తీసుకోలేదని బుద్ధా విమర్శించారు. ఇప్పుడు ఎంపీపై చర్యలు తీసుకుంటారో, అంబటిలా పదవి ఇచ్చి గౌరవిస్తారో చూద్దాం అంటూ బుద్ధా ట్విట్టర్‌ లో స్పందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img