Monday, December 5, 2022
Monday, December 5, 2022

ఈడీ విచారణకు హాజరైన జేసీ ప్రభాకర్‌రెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి రెండోరోజు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఉదయం 10.15 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు. భారత్‌ స్టాండర్డ్స్‌ (బీఎస్‌)-3 ప్రమాణాలు కలిగిన లారీలను బీఎస్‌-4 వాహనాలుగా మార్చారనే ఆరోపణల నేపథ్యంలో గత జూన్‌లో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. అనంతపురం, హైదరాబాద్‌, తాడిపత్రిలోని ప్రభాకర్‌ రెడ్డి ఇంట్లో, కుటుంబీకుల ఇళ్లల్లో ఈ సోదాలు జరిగాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img