సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్
విశాలాంధ్ర-గుంతకల్లు : అనంతపురం జిల్లాకి ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలేసి ఏ ముఖం పెట్టుకొని జగన్ అనంతపురం జిల్లాకి వస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ ప్రశ్నించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.జగదీష్ మాట్లాడుతూ…తొలి సారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అనంతపురం బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి హాంద్రి-నివా కాలువలు చూసి వెడల్పు చేసి ఐదువేల క్యూసెక్కుల కు మరో సమాంతర కాలువ ద్వారా ఇంకొక 5, వేల క్యూసెక్కుల హాంద్రి-నివా నుండి జీడిపల్లికి తీసుకువస్తామని వాగ్దానం చేశారు. అయితే దాని సంగతి అతిలేదు గతి లేదని మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలు అవుతున్న తుంగభద్ర హెచ్ ఎల్ సి కెనాల్ ని ఆదుని కరణ చేస్తామని వాగ్దానం చేశారు. నాలుగు సంవత్సరాలు అవుతున్న ఏమాత్రం ఆదుని కరణ చేయలేదని ప్రశ్నించారు. అదేవిధంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలలో మూడు లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందించి పిల్ల కాలువలు ఏర్పాటు చేస్తామని నమ్మం పలికారు.అయితే ఇంతవరకు ఎక్కడ కూడా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు ఉందని ఎదేవచెశారు.ముఖ్యమంత్రి పేరూరు డ్యామ్ కి నీళ్లు అందించడానికి రెండు రిజర్వాయర్ కి న్యామద్దల, తోపుదుర్తి కి రిమోట్ కంట్రోల్ ద్వారా శంకుస్థాపన చేశారు.అయితే ఇప్పటికి కూడా కార్య రూపం దాల్చలేదని తెలిపారు.
అలాంటప్పుడు 26 తారీకున ఏ ముఖం పెట్టుకొని అనంతపురం కి వస్తున్నారని ప్రశ్నించారు. వసతి దీవన బటన్ నొక్కడానికి ఇంతదూరం వచ్చి కోట్లాది రూపాయలు ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నావని ప్రశ్నించారు. జిల్లాలో పంటలన్నీ నష్టపోయి ఖరీఫ్ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఆత్మహత్యలు చేసుకోవడం దేశంలో మూడో స్థానంలో ఉందని అన్నారు. ఇంతవరకు ఏడవ స్థానంలో ఉంటే ప్రస్తుతం మూడో స్థానంలో ఉందని తెలిపారు. నష్టపోయిన రైతులకు పరామర్శించడానికి బరోసా కల్పించేందుకు రాలేదు కాని బటన్ నొక్కడానికి వస్తున్నాడంటా సార్ ! అకాల వర్షాల వల్ల జిల్లాలో నష్టపోయిన రైతుల కుటుంబాలను ఆత్మశైర్యం నింపేందుకు రావాలి..రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాని ఏ ముఖం పెట్టుకుని అనంతపురంకి వస్తున్నావని ప్రశ్నించారు.. బటన్ నొక్కడానికోసం వచ్చాడనుకుంటే అది కాదు మీడియాని దూషించడం, ప్రతిపక్షాలను తిట్టడం కోసమే అజెండా పెట్టుకున్నాడని అన్నారు. అనంతపురం జిల్లా కి వస్తున్నాడు అంటే ఏమి వరాలు ఇస్తాడని ప్రజలు ఆశిస్తున్నారు. అయితే ఆయన ఏ హామీ ఇచ్చే పరిస్థితి కనబడలేదని అన్నారు.. ఈనెల 26వ తేదీన గుంతకల్లులో మోడీకి హటావో దేశ్ కి బచావో అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ,సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబుల కొండ రెడ్డి హాజరవుతారని తెలిపారు.అదేవిదంగా పాత గుంతకల్ నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించడంహూ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు, సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్, సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు, ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొన్నారు.