Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

ఈ నెల 11 నుంచి కొత్త మంత్రులు : పేర్నినాని

ఈనెల 11 నుంచి కొత్త మంత్రులు రానున్నారని, ఎవరు రవణా మంత్రిగా వచ్చినా..తన అభిప్రాయాలను పంచుకుంటానని మంత్రి పేర్నినాని అన్నారు. మూడేళ్లపాటు లారీలు, బస్సు యజమానుల సంఘాలతో కలిసి పనిచేసినవాడిగా మీ సమస్యలను కొత్త రవాణా మంత్రి వద్దకు, అవసరమైతే సీఎం వద్దకు తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ అసోసియేషన్‌తో ఇదే చివరి సమావేశం అనుకుంటున్నా అని మంత్రి నాని పేర్కొన్నారు. బస్‌ అండ్‌ కార్‌ ఆపరేటర్స్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఏపీ, తెలంగాణ బస్‌ ఆపరేటర్ల అసోసియేషన్ల ఆధ్వర్యంలో ‘వన్‌ ఇండియా, వన్‌ బస్‌’ వెబ్‌సైట్‌ను మంత్రి సోమవారం రాత్రి విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘నాకు మంత్రి పదవి ఇచ్చాక రవాణాశాఖ కేటాయించినపుడు.. ఇందులో అధికారులు ఎవరెవరు ఉన్నారని చూశాను. ఎవరి మాట వినని ముగ్గురు అధికారులను అప్పగించినందుకు సీఎం జగన్‌ను తిట్టుకున్నానన్నారు.రవాణా మంత్రిగా ఎవరు వచ్చినా తన అభిప్రాయాలు వారికి చెప్పడమే కాకుండా.. రవాణా వ్యవస్థలో సమస్యలు పరిష్కరించడానికి వ్యక్తిగతంగా కృషిచేస్తానన్నారు. తెలంగాణలో మా బస్సులకు మీరు కేసులు రాస్తే, మేమూ ఇక్కడ రాస్తామని మంత్రి నాని హెచ్చరించారు. లారీలకు సంబంధించి అంతర్‌ రాష్ట్ర ఒప్పందం కోసం తెలంగాణ అధికారులతో ప్రయత్నం చేశామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img