Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

ఈ నెల 26 నుంచి ఏపీలో దసరా సెలవులు

దసరా పండుగను పురస్కరించుకుని ఏపీలోని పాఠశాలలకు సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 26 నుంచి ఏపీలో దసరా సెలవులు మొదలు కానున్నాయి. అదే విధంగా వచ్చే నెల (అక్టోబర్‌) 6 వరకు సెలవులను ప్రకటించిన ప్రభుత్వం.. అక్టోబర్‌ 7న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. మొత్తంగా 11 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 26 నుంచి దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించగా… పాఠశాలలకు మాత్రం 25ననే సెలవులు ప్రారంభం కానున్నాయి. ఎందుకంటే ఈ నెల 25న ఆదివారం కాబట్టి. ఈ సెలవులు సాధారణ పాఠశాలలకు మాత్రమే. క్రిస్టియన్‌, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్‌ 1 నుంచి 6 వరకు సెలవులు ఇస్తూ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పాఠశాలలు కూడా ఇతరత్రా పాఠశాలల మాదిరే అక్టోబర్‌ 7న పునఃప్రారంభం కానున్నాయి. ఇక ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు 220 పనిదినాలు, 80 సెలువులుగా ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img