Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు : సజ్జల

ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం.. మంత్రుల కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదిక అడిగారని చెప్పారు. సమ్మె ప్రతిపాదన వాయిదా వేయాలని ఉద్యోగసంఘాలను మంత్రుల కమిటీ కోరిందన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమకు ఎవరికీ అన్యాయం చేయాలని లేదన్నారు. హైకోర్టు సలహాను ఉద్యోగ సంఘాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇది పాజిటివ్‌ చర్చగానే తాము భావిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img