సీఎం జగన్, చిరంజీవితో భేటీ తర్వాతైనా సినీ పరిశ్రమపై దాడి ఆగిపోవాలని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆకాంక్షించారు. గురువారం ఆయన మాట్లాడుతూ, కొందరి స్వార్థ రాజకీయాల వల్లే సంక్రాంతి జరుపుకోలేకపోతున్నానని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. క్షవరం అయిందని ఓటర్లకు రెండేళ్ల తర్వాత తెలిసిందన్నారు. ఉద్యోగులకు జగనన్న శఠగోపం పెట్టారని అన్నారు. క్షవరం అయితేగాని వివరం రాదనేలా ఉద్యోగసంఘాల పరిస్థితి ఉందన్నారు. అందరూ దివాళా తీసి కొంపలు అమ్ముకోవాలన్నట్లుగా ఉందన్నారు. ప్రస్తుతం పీఆర్‌సీ కొనసాగితే చాలు అనేలా ఉద్యోగులు భావిస్తున్నారని పేర్కొన్నారు. తనను స్ఫూర్తిగా ప్రజలు పోరాడాలని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను మళ్లీ గెలిపించాలని రఘురామ కోరారు.