ఏపీ ఉద్యోగులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఉద్యోగులకు టీడీపీ హయాంలో ఇచ్చిన రాయితీల్లో కోత పెట్టారని చంద్రబాబు విమర్శించారు. ఉద్యోగులు, పెన్షనర్లు, సీపీఎస్, ఔట్ సోర్సింగ్, ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులకు జగన్‌రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగులకి జగన్‌రెడ్డి సర్కార్ రివర్స్ పీఆర్సీ ఇచ్చిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అనేక రాయితీల్లో వైసీపీ కోత విధించడమే..సీఎం జగన్‌రెడ్డి పెద్ద మనస్సుకు నిదర్శనమా? అని ఆయన ప్రశ్నించారు. కరోనా పేరు చెప్పి ఏ రాష్ట్రం కూడా వేతనాల్లో కోతలు పెట్టలేదని అన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. టీడీపీ హయాంలో 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. లూటీ, దుబారా కట్టిపెట్టి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.