Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

ఉద్యోగులు, పోలీసుల పట్ల జగన్‌ రెడ్డి వ్యవహారం దుర్మార్గం : యనమల

ఉద్యోగులను వాడుకొని వదిలివేయడంలో సీఎం జగన్‌ను మించిన వారు లేరని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అడ్డూ అదుపూ లేని అప్పులతో ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పింది. అవసరం తీరే వరకే అన్న.. అవసరం తీరాక దున్న అన్నట్లు జగన్‌ వైఖరి ఉందన్నారు. ఉద్యోగులు, పోలీసుల పట్ల జగన్‌ రెడ్డి వ్యవహారం దుర్మార్గమన్నారు.ప్రతిపక్షాల అక్రమ అరెస్టులకు అడ్డగోలుగా వాడుకుని.. అవమానకర రీతిలో సవాంగ్‌ను గెంటేశారని తెలిపారు. డీజీపీ స్థాయి వ్యక్తికి పోస్టింగ్‌ ఇవ్వకుండా అవమానించారని అన్నారు. ‘సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంను అన్నా అంటూనే.. గెంటారు. పీవీ రమేష్‌, అజేయకల్లాం రెడ్డికి పొమ్మనకుండా పొగబెట్టారు.అజేయకల్లాంతో న్యాయమూర్తులపై విషం కక్కించి తర్వాత పంపేశారు. చీకటి జీవోల ఆధ్యుడు ప్రవీణ్‌ ప్రకాశ్‌ ను ఆకస్మికంగా ఢల్లీి తరిమేశారు. జగన్‌ రెడ్డి వ్యవహారశైలిని, నైజాన్ని ఉద్యోగులు, పోలీసులు అర్ధం చేసుకోవాలి.’ అని అన్నారు. ‘ కరోనాను బూచిగా చూపించి ఎడాపెడా అప్పులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 360 ప్రకారం రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ విధించాలి’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img