Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఆర్డినెన్స్‌ జారీ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పెంపు అంశంపై ఏపీ సర్కార్‌ మరో అడుగు ముందుకేసింది. పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. 2022 జనవరి 1నుంచి ఈ ఉత్వర్వులు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం సంతకం చేశారు. కాగా ఇటీవల ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిని మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు ఫైలుపై ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ సంతకం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img