Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ఎన్ఐఏ కోర్టుకు హాజరైన సీఎం జగన్ పీఏ

గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు విచారిస్తోంది. ఈ రోజు జరిగిన కోర్టు విచారణకు నిందితుడు శ్రీనివాస్ హాజరయ్యాడు. మరోవైపు ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కోర్టును మినహాయింపును కోరిన సంగతి తెలిసిందే. జగన్ తరపున ఆయన పీఏ కె నాగేశ్వరరెడ్డి కోర్టుకు హాజరయ్యారు. ఎన్ఐఏ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.2018 అక్టోబర్ లో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై ఈ దాడి జరిగింది. ఎయిర్ పోర్టులోని ఒక రెస్టారెంట్ లో పని చేస్తున్న శ్రీనివాస్ ఆయనపై దాడి చేశాడు. ఆ గాయంతోనే జగన్ నేరుగా హైదరాబాద్ కు వచ్చి చికిత్స చేయించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img