Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ఎన్నికల వ్యవస్థని నడిబజారులో అంగడి సరుకు చేశారు : లోకేష్‌

కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డబ్బుతో అత్యంత పవిత్రమైన ఎన్నికల వ్యవస్థని జగన్‌రెడ్డి నడిబజారులో అంగడి సరుకు చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ అన్నారు. బాబాయ్‌ని గొడ్డలి పోటుతో బలిచేసినట్టే.. ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో జగన్‌రెడ్డి ఖూనీ చేస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలను నిర్బంధించి, ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారన్నారు. వైసీపీ వలంటీర్లే దొంగ ఓటర్లని బూత్‌లకు తీసుకొస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందన్నారు. పోలీసుల ముందే దొంగ ఓటర్లు కాలరెగరేసుకుని వెళ్తూ ఓటేసి వస్తున్నారని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తే దారుణ ఓటమి తప్పదని జగన్‌రెడ్డి తెలుసుకున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img