Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

ఎన్ని దాడులు చేసినా అన్నా క్యాంటీన్లు నిర్వహించి తీరుతాం

తెలుగుదేశంపై ఎన్నిసార్లు దాడి చేసినా పేదల కడుపునింపే అన్నా క్యాంటీన్లు నిర్వహించి తీరుతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదలకు అన్నదానం చేయాలంటే కోర్టుకెళ్లి అనుమతులు తెచ్చుకునే దుస్థితి నెలకొందని అన్నారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ… పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రద్దు చేయటంతో పాటు ప్రభుత్వం పెట్టకపోగా పెట్టేవారిపై దాడులు చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. జగన్మోహన్‌ రెడ్డి విధ్వంసం వల్ల నష్టపోని వర్గమంటూ లేదని అన్నారు. హత్యలు చేసేవారు, అక్రమ మద్యం, ఎర్రచందనం, బియ్యం, గంజాయి సరఫరా చేసేవారికి లేని చెక్‌ పోస్టులు డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళనకు దిగిన సీపీఎస్‌ ఉద్యోగులకు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా తీసుకురావటం, మద్యనిషేదం, పోలవరం పూర్తి, అమరావతి నిర్మాణంపై ఎన్నికల ముందు అసత్య హామీలు ఇచ్చారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img