Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

ఏపీకి ఆరో విడత రెవెన్యూ లోటు నిధులు.. 879.08 కోట్లు విడుదల చేసిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ సహా మొత్తం 14 రాష్ట్రాలకు కేంద్రం రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది. సెప్టెంబర్‌ వాటా కింద మొత్తం రూ. 7,183.42 కోట్లు విడుదల చేయగా, అందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా రూ. 879.08 కోట్లు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం రూ. 43,100.50 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రాష్ట్రాలు రూ. 86,201 కోట్లు రెవెన్యూ లోటు కింద అందుకుంటాయని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img