Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఏపీకి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు.. : సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ లో కీలక ప్రసంగం చేశారు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు వచ్చిన పారిశ్రామికవేత్తలకు అభినందనలు తెలిపారు. విశాఖలో గ్లోబల్‌ సమ్మిట్‌ జరగడం చాలా గర్వంగా ఉందని.. రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటించారు. రాష్ట్రంలో 6లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. మొత్తం 92 ఎంవోయూలు కుదుర్చుకుంటున్నామని.. 340 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని.. రూ.8.54 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంవోయూలు ఇవాళ జరుగుతాయని ప్రకటించారు. మిగిలిన కొన్ని ఎంవోయులు శనివారం జరుగుతాయని తెలిపారు.విశాఖపట్నం మినీ ఎకనిమిక్‌ హబ్‌ మారుతుందన్నారు సీఎం. ఇండియాలో అతి కీలకమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉందని..రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరిగాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ సదుపాయాలకు భిన్నంగా రాష్ట్రం ఉందని.. ముఖ్యమైన జీ 20 సదస్సుకు కూడా విశాఖ నగరం వేదికగా నిలిచిందన్నారు. విశాఖ పరిపాలన రాజధాని.. త్వరలో ఇక్కడ నుండే పాలన జరగబోతోందని ప్రకటించారు. ఏపీ కీలక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామని.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లు నంబర్‌వన్‌గా ఉందన్నారు. ఏపీలో సులువైన పారిశ్రామిక విధానం ఉందని.. నైపుణ్యాభివద్ధి కాలేజీలతో పారిశ్రామికాభివృద్ధి జరుగుతోందన్నారు. రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరిగాయని.. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు వస్తుంటే.. ఏపీలోనే 3 పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయన్నారు. పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలతో నంబర్‌వన్‌గా నిలిచామని.. గ్రీన్‌ ఎనర్జీపై ప్రధాన ఫోకస్‌ పెట్టామన్నారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540 సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు.భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలం.ఆంధ్రప్రదేశ్‌లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు సీఎం. రాష్ట్రంలో 6 పోర్టులు ఇప్పటికే ఉన్నాయి.. మరో 4 పోర్టులు రాబోతున్నాయని తెలిపారు. పోర్టులకు సమీపంలో పుష్కలంగా భూములున్నాయని.. అలాగే నైపుణ్యం కలిగిన యువతకు ఏపీలో కొదవ లేదన్నారు.

పలు కీలక రంగాల్లో ప్రభుత్వం ఒప్పందాలు ఇలా ఉన్నాయి.
పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు
ఎన్టీపీసా ఎంవోయూ(రూ. 2..35లక్షల కోట్లు)
ఏబీసీ లిమిటెట్‌ ఎంవోయూ(రూ. 1.20 లక్షల కోట్లు)
రెన్యూ పవర్‌ ఎంవోయూ(రూ. 97, 550 కోట్లు)
ఇండోసాల్‌ ఎంవోయూ(రూ. 76, 033 కోట్లు)
ఏసీఎమ్‌ఈ ఎంవోయూ(రూ. 68,976 కోట్లు)
టీఈపీఎస్‌ఓఎల్‌ ఎంవోయూ( రూ. 65, 000 కోట్లు)
జేఎస్‌డబ్యూ గ్రూప్‌(రూ. 50, 632 కోట్లు)
హంచ్‌ వెంచర్స్‌(రూ. 50 వేల కోట్లు)
అవాదా గ్రూప్‌( రూ 50 వేల కోట్లు)
గ్రీన్‌ కో ఎంవోయూ(47, 600 కోట్లు)

మరికొన్ని కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img