Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

ఏపీకి వర్ష సూచన

రాగల మూడు రోజులు ఒకటి, రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు రాష్ట్రంలో చాలా జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలోని ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల దగ్గర స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ద్రోణి మధ్య ట్రోపోస్పీయర్‌ స్థాయి వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లేకొలది నైరుతి వైపుకు వంపు తిరిగి ఉండి స్థిరంగా కొనసాగుతోందని.. ద్రోణి కుచ్‌ నుండి ఉత్తర మధ్య మహారాష్ట్ర, వీదర్భా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర కోస్తా ఆంధ్ర మీదగా అల్పపీడన ప్రాంతం వరకు వ్యాపించి ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img