Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ఏపీలోని పలు ఆస్పత్రుల్లో ఈడీ సోదాలు..

ఏపీలోని పలు ఆస్పత్రుల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. గుంటూరు మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రుల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢల్లీి నుంచి వచ్చిన నాలుగు ప్రత్యేక బృందాలు ఎన్నారై ఆసుపత్రి, ఆసుపత్రి కమిటీ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తోంది. ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి పాత మేనేజ్మెంటులోని డైరెక్టర్‌ ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ ఈ సోదాలు నిర్వహిస్తోంది. కోవిడ్‌ సమయంలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని గతంలోనే కేసు నమోదైంది. మాన్యువల్‌ రసీదులు.. నకిలీ రసీదులతో నిధులను పక్కదారి మళ్లించారని.. కోవిడ్‌ సమయంలో ట్రీట్మెంట్‌ తీసుకున్న 1500 పేషంట్ల వివరాలను రికార్డుల్లో చేర్చలేదని గతంలోనే గుర్తించారు అధికారులు. కొంత మంది ఉద్యోగుల సహకారంతో దొంగ ఖాతాలకు నగదు మళ్లింపులు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img