Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

ఏపీలో కొత్తగా 1,435 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 69,173 కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 1,435 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2000038కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19,70,864మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15472 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్తగా మరో ఆరుగురు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13702కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,59,72,539 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img