ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,131 నమూనాలు పరీక్షించగా, కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారినపడి నిన్న కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా బారి నుంచి గడిచిన 24 గంటల్లో 188 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,954 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో పేర్కొంది.