Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ఏపీలో కొత్తగా 2,107 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 78,784 పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,107 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 19,62,049కి చేరింది. ఇందులో 21,279 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 1,807 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్రవ్యాపంగా కోలుకున్న వారి సంఖ్య 19,27,438కి చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 20 మంది మరణించారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో ఆరు మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 13,332కి చేరింది. కాగా, నిన్న నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 392 నమోదు కాగా, తూర్పుగోదావరిలో 316, కృష్ణలో 303, నెల్లూరులో 242, ప్రకాశం 200, గుంటూరు 193, విశాఖపట్నం 163, పశ్చిమ గోదావరి 69, అనంతపురం 61, వైఎస్సార్‌ కడప 58, శ్రీకాకుళం 44, కర్నూలు 38, విజయనగరం 28 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img