Monday, February 6, 2023
Monday, February 6, 2023

ఏపీలో కొత్తగా 878 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 41,173 శాంపిల్స్‌ పరీక్షించగా 878 మందికి వైరస్‌ సోకినట్లు నిర్థారణయ్యింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2013001కి చేరింది. కరోనా బారినపడి 13 మంది వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13838 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,182 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1984301కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14862 యాక్టివ్‌ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 2,65,76,995 శాంపిల్స్‌ టెస్ట్‌ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img