సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని
సీఎం జగన్‌తో జరిగిన చిరంజీవి బృందం భేటీ ముగిసింది. అనంతరం మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఏం కావాలన్నా సహకారం అందిస్తామని సీఎం జగన్ చెప్పారని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి అందర్నీ సమన్వయం చేశారని పేర్కొన్నారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చేందుకు చిరంజీవి కృషి చేశారన్నారు. సినీ సమస్యలపై ఎవరెవరో ఏదేదో మాట్లాడినా.. మెగాస్టార్ మాత్రం సమస్య పరిష్కారానికి తీవ్ర కృషి చేశారన్నారు.చిన్న సినిమాల మనుగడ ఉండాలని నటుడు నారాయణమూర్తి కోరారన్నారు. ఏపీలో సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. స్టూడియోల నిర్మాణంతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. సరైన ప్రతిపాదనలతో టాలీవుడ్ పెద్దలు రావాలని మంత్రి పేర్నినాని అన్నారు.సుమారు గంటకు పైగా జరిగిన సమావేశంలో.. చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్ నారాయణ మూర్తి, నిరంజన్ రెడ్డి, అలీ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.