ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెట్టడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. హైదరాబాద్‌లో మీడియా చిట్‌చాట్‌లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ పెడతారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, రాజకీయ పార్టీ ఎప్పుడైనా పెట్టవచ్చు… పెట్టకూడదనే రూల్ ఏమీ లేదుకదా? అని వ్యాఖ్యనించారు. కొంత కాలంగా సోదరుడు జగన్ తీరుపై షర్మిల ఆగ్రహంగా ఉన్నారు. మొన్న పులివెందుల వెళ్లినప్పుడు కూడా జగన్, షర్మిల మధ్య వాగ్వాదం జరిగిందనే వార్త గుప్పుమంది. అంతేకాదు జగన్ ఏపీలో ఉండి ఇక్కడ తెలంగాణలో తనకు నష్టం కలిగిస్తున్నారని షర్మిల అభిప్రాయం పడుతున్నట్లు సమాచారం. కాగా తెరాస సీనియర్ నేత, బీసీ నాయకుడు గట్టు రామచందర్‌రావు ఇవాళ ౖ వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైఎస్ షర్మిల పార్టీ కండువా కప్పి రామచందర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు.