Friday, September 30, 2022
Friday, September 30, 2022

ఏపీలో ప్లాస్టిక్‌ బ్యానర్లు బ్యాన్‌ : సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్లాస్టిక్‌ బ్యానర్లు బ్యాన్‌ చేసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. ఇవాళ సీఎం జగన్‌ విశాఖపట్నంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ సమక్షంలో అమెరికాకు చెందిన పార్లే ఫర్‌ ది ఓషన్స్‌ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 2027 నాటికి ఏపీని ప్లాస్లిక్‌ కాలుష్య రహిత రాష్ట్రంగా మలిచేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు. ఏపీలో ఇవాళ్టి నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు నిషేధిస్తున్నట్టు స్పష్టం చేశారు. కేవలం వస్త్రంతో చేసిన ఫ్లెక్సీలకే అనుమతి ఉంటుందని వెల్లడిరచారు.ప్లాస్టిక్‌ కాలుష్య రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు దీన్ని మొదటి అడుగుగా భావిస్తున్నాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.ఇవాళ కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ.. ప్లాస్టిక్‌ వ్యర్థాలను క్లీన్‌ చేశారు వలంటీర్లు. ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ఈరోజు విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం జరిగిందని సీఎం జగన్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img