ఏపీలో భయంకరమైన వాతావరణం ఏర్పడుతోందని సీపీఐ నేత నారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోల్డ్ మర్డర్ వ్యవస్థ ఏపీలో ఉందని, ఇది అత్యంత ప్రమాదకరమైన అంశమని అన్నారు. వైఎస్ వివేకా హత్యపై రాష్ట్రంలో చర్చ జరుగుతోందన్నారు. ఏకంగా సీబీఐపైనే సుప్రీంకోర్టుకు వెళ్తానని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అంటున్నారన్నారు. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారన్నది కోర్టులో వివాదం నడుస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే సీబీఐను సపోర్ట్ చేస్తారు లేకుంటే వ్యతిరేకిస్తారని అన్నారు.