Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు? పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. మంగళవారం మచిలీపట్నంలో బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొత్త జిల్లా ఏర్పాటుపై మాట్లాడారు. ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశముందని అన్నారు. ఆ కొత్త జిల్లా కూడా గిరిజన ప్రాంతాలతోనే ఏర్పాటు అవుతుందని తెలిపారు. ఇప్పటికే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు పూర్తిగా గిరిజన ప్రాంతాలతోనే ఉన్నాయి. తాజాగా గిరిజన ప్రాంతాలతోనే మరో జిల్లా ఏర్పాటుకానుందని తెలుస్తోంది. దీంతో 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందని పేర్ని నాని చెప్పారు. దీంతో మంత్రి వ్యాఖ్యలను బట్టి రంపచోడవరం, చింతూరు ఏజెన్సీ ప్రాంతాలతో జిల్లాను ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాలు పాడేరు పరిధిలో ఉన్నాయి. జిల్లా కేంద్రానికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో రంపచోడవరం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img