ఏపీలో పలు ప్రాంతాల్లో మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్ర ప్రదేశ్-ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడిరది. ఇది పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 1.5 కిమీ నుండి 4.5 కిమీ ఎత్తుల మధ్య కొనసాగుతుందని తెలిపింది. ఉత్తర, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రభావంతో ఏపీలో వివిధ ప్రాంతాల్లో మరో రెండ్రోజలు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఉత్తర కోస్తా ఆంధ్రా, దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమలో రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.