Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ఏపీలో మూడు రోజులు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. కొమరిన్‌ దాని పరిసర ప్రాంతాల మీద ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం లక్ష్యద్వీపం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీద ఉంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కీమీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి రాగల 3-4 రోజుల్లో మరింత బలపడుతుందని తెలిపింది. మరో ఉపరితల ద్రోణి కొమరిన్‌ ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీద నుండి పశ్చిమ మధ్య బంగాళా ఖాతం, దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం వరకు మన్నార్‌ గల్ఫ్‌ తమిళనాడు తీర ప్రాంతం మీదుగా వ్యాపించి ఉంది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రా, దక్షిణ కోస్తా ఆంధ్రా, రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img