Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

ఏపీలో రెండు రహదారులకు ఆమోదం

భారతమాల పరియోజన కింద ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రాజెక్టులకు పాలనాపరమైన ఆమోదం లభించింది. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ రహదారుల విషయాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రూ.909.47 కోట్లతో చిల్లకూరు క్రాస్‌ రోడ్‌ నుంచి తూర్పు కనుపూరు వరకు నాలుగు లేన్‌లతో.. మొత్తం 36.05 కి.మీ పొడవుతో యాక్సెస్‌ కంట్రోల్డ్‌ హైవే నిర్మాణం జరగనుందని తెలిపారు. ఇటు నాయుడుపేట (గ్రీన్‌ఫీల్డ్స్‌) నుంచి తూర్పు కనుపూరు వరకు రూ.1,398.84 కోట్లతో మొత్తం 34.881 కి.మీ పొడవుతో ఆరులేన్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. మరోవైపు అదానీ గ్రూప్‌ ఎంఏఐఎఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌లోని టోల్‌ రహదారుల పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ అదానీ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (ఏఆర్‌టీఎల్‌) ద్వారా ఈ డీల్‌ చేసుకుది. ఎస్‌టీపీఎల్‌కు ఆంధ్రప్రదేశ్‌లో రెండు టోల్‌ రోడ్‌లు ఉన్నాయి. ఒకటి నేషనల్‌ హైవే 16పై తడ నుంచి నెల్లూరు (110 కి.మీ.) వరకు ఉంది. మరొకటి నేషనల్‌ హైవే 65పై నందిగామ నుంచి ఇబ్రహీంపట్నం- విజయవాడ వరకూ(48 కి.మీ.) ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img