లక్ష దాటిన కరోనా యాక్టివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజకూ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 46,929 నమూనాలు పరీక్షించగా, కొత్తగా 13,819 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి తాజాగా చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు,నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఇద్దరేసి మృతి చెందగా, ప్రకాశం, పశ్చిమగోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా నుంచి గడిచిన 24 గంటల్లో 5,716 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 101396 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా విశాఖపట్నంలో 1988 కేసులు నమోదయ్యాయి.