Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

ఏపీ అదనపు రుణాలు పొందేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అదనపు రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకున్న 11 రాష్ట్రాలకు అదనపు రుణాలకు కేంద్ర అనుమతి ఇవ్వగా. అందులో ఏపీ కూడా ఉంది. ఏపీకి అదనంగా రూ. 2,655 కోట్ల రుణాలకు ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. ఏపీతోపాటు బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, హరియాణ, కేరళ, మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయ, నాగాలాండ్‌, రాజస్థాన్‌, ఉత్తరఖండ్‌.. ఈ 11 రాష్ట్రాలకు రూ. 15,721 కోట్ల రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం అనుమతి ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img