Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స

ఏపీ ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. . ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్యాహ్నం 12:30 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. ఏపీ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు రెగ్యూలర్‌ ఫలితాలతో పాటు ఒకేషనల్‌ ఫలితాలను ఏపీ ఇంటర్‌ బోర్డ్‌ విడుదల చేసింది. ఫలితాల వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడిరచారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో బాలురు 49 శాతం, బాలికలు 60శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో బాలురు 56 శాతం, బాలికలు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్‌ ఇయర్‌ 4,45,604 రాస్తే 2,41,591 మంది అంటే 54 శాతం ఉత్తీర్ణులయ్యారు. 4,23,455 మంది రాస్తే… 2,58,446 మంది పాస్‌ అయ్యారు. అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 50 శాతం మంది పాస్‌ అయినట్లు మంత్రి బొత్స వెల్లడిరచారు.ఏపీలో ఇంటర్‌ పరీక్షలు 6వ తేదీ నుంచి ఫస్టియర్‌, 7వ తేదీ నుంచి సెకండియర్‌ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. ఏపీ ఇంటర్‌ బోర్డు పటిష్ట ఏర్పాట్లతో మే 24వ తేదీ వరకు ఏపీ ఇంటర్‌ పరీక్షలను పూర్తి చేసింది. ఆపై ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా చేశారు. ఏపీలో మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img