Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

ఏపీ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు


ఏపీ మంత్రుల శాఖలు ఇవే
ఏపీ కొత్త కేబినెట్‌లోని మంత్రులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శాఖలను కేటాయించింది. గత కేబినెట్‌ తరహాలోనే అయిదుగురికి ఉపముఖ్యమంత్రుల పదవులను కట్టబెట్టింది.రాజన్న దొర, బూడి ముత్యాలనాయుడు, అంజాద్‌ బాషా, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి ఉపముఖ్యమంత్రులుగా ఎంపికయ్యారు. కొత్తగా కొలువుదీరిన మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ఆయా మంత్రులు, వారికి కేటాయించిన శాఖలు కింది విధంగా ఉన్నాయి.

  1. బొత్స సత్యనారాయణ : విద్యా శాఖ
  2. బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి: ఆర్థిక శాఖ
  3. అంబటి రాంబాబు : జలవనరుల శాఖ
  4. ఆర్కే రోజా : పర్యాటక శాఖ
  5. ఆదిమూలపు సురేశ్‌ : పురపాలక శాఖ
  6. తానేటి వనిత : హోం శాఖ
  7. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ: బీసీ సంక్షేమం
  8. కారుమూరి నాగేశ్వరరావు : పౌర సరఫరాల శాఖ
  9. కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ
  10. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : గనుల శాఖ
  11. గుడివాడ అమర్‌నాథ్‌ : పరిశ్రమలు, ఐటీ శాఖ
  12. జోగి రమేశ్‌ : గృహ నిర్మాణ శాఖ
  13. గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ
  14. ఉషశ్రీ చరణ్‌ : మహిళా శిశు సంక్షేమ శాఖ
  15. పీడిక రాజన్న దొర : గిరిజన సంక్షేమం
  16. సీదిరి అప్పలరాజు : పశుసంవర్ధక శాఖ
  17. దాడిశెట్టి రాజా : రోడ్లు, భవనాల శాఖ
  18. ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ శాఖ
  19. మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ
  20. కాకాణి గోవర్ధన్‌ రెడ్డి : వ్యవసాయ శాఖ
  21. నారాయణ స్వామి : ఎక్సైజ్‌ శాఖ
  22. అంజాద్‌ బాషా : మైనారిటీ సంక్షేమం
  23. పినిపే విశ్వరూప్‌ : రవాణా శాఖ
  24. విడదల రజని : వైద, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
  25. బూడి ముత్యాలనాయుడు : పంచాయతీరాజ్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img