Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

ఏపీ కేబినేట్‌ : పలు కీలక అంశాలకు ఆమోదం

ఇవాళ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు కేబినేట్‌ ఆమోదం తెలిపింది.ఈ సమావేశంలో 39 అంశాలపై కేబినెట్‌ చర్చించింది. వైఎస్సార్‌ ఆసరా పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.రోడ్‌ డెవలప్మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ నియామకానికి సంబంధించిన చట్ట సవరణను సైతం ఏపీ కేబినేట్‌ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి 10 వేల మెగా వాట్ల సౌర విద్యుత్‌ పొందేందుకు మంత్రి వర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే వ్యవసాయ వినియోగానికే 10 వేల మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. యూనిట్‌కు రూ. 2.49కు సరఫరా చేసేలా కేబినేట్‌ ఆమోదం తెలిపింది. విద్యా, వైద్య సంస్థల సదుపాయాల దాతల పేర్లు 20 ఏళ్లు పెట్టే ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది. మైనార్టీలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img