Monday, September 26, 2022
Monday, September 26, 2022

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్‌ల బదిలీ

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీలు తక్షణం అమల్లోకి వస్తాయంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా సి. నాగరాణి బాధ్యతలు అప్పగిస్తూ బదిలీ చేసింది ప్రభుత్వం. అలాగే చేనేత, జౌళి శాఖ కమిషనర్‌గా ఎం.ఎం. నాయక్‌ఖాదీ విలేజ్‌ సీఈవో, ఆప్కో ఎండీగా నాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే సర్వ శిక్షాభియాన్‌ అదనపు పీడీగా శ్రీనివాసరావు, రైతు బజార్ల సీఈవోగా శ్రీనివాస రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పాఠశాలల మౌలిక వసతుల కల్పన కమిషనర్‌గా కాటంనేని భాస్కర్‌, మిషన్‌ క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్స్‌ కమిషనర్‌గా భాస్కర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా జయలక్ష్మీకి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img